Mar 06,2023 20:58

ప్రచారం చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు

ప్రచారం చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో
ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారం
నెల్లూరు :నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పి.బాబురెడ్డిల గెలుపును ఆకాంక్షిస్తూ నగరంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. 23వ డివిజన్‌లో ఓటర్లు పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్ధులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ సిపిఎం, సిఐటియు, డివైఎప్‌ఐ , ఆవాజ్‌ , పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. రూరల్‌ పరిధిలో గల 27వ డివిజన్‌ పోలీస్‌ కాలనీ ప్రాంతంలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్థులు మీగడ వెంకటేశ్వర రెడ్డి (పట్టబద్రులు) బ్యాలెట్‌ నెంబర్‌- 21. పోకిరెడ్డి బాబురెడ్డి (ఉపాధ్యాయ) బ్యాలెట్‌ నెంబర్‌- 6 గెలుపు కొరకు ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్‌ అధ్యక్షులు కొండా ప్రసాద్‌ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు మణి. రిక్షా యూనియన్‌ నాయకులు నారాయణ. సిఐటియు కార్యకర్తలు పిచ్చయ్య. చిన్న రమణయ్య. శివారెడ్డి. కుమార్‌ మేస్త్రి. సెల్వి మేస్త్రి. తదితరులు పాల్గొన్నారు. మూలాపేట ప్రాంతంలోని సిపిఎం శాఖ ఆధ్వర్యంలో పరమేశ్వరి నగర్‌ ప్రాంతాలలో, ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓటర్లను కలవడం జరిగింది,ఈ కార్యక్రమంలో అల్లాడి గోపాల్‌ ,ఎం. నాగేశ్వరరావు , ఎస్‌ అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 26వ డివిజన్‌ పరిధిలో గల వేదాయపాలెం, త్యాగరాజు నగర్‌ ప్రాంతంలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్దుల గెలుపును కోరుతూ సిపిఎం రూరల్‌ కమిటీ సభ్యులు దేవతాటి. సంపత్‌ కుమార్‌, శాఖ కార్యదర్శి ఎస్‌కె . కాలేషా, పులిమి. నరసింహారెడ్డి, డి. శ్రీనివాస బాబు, బి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆటో కార్మిక సంఘం సిఐటియు రూరల్‌ ఆటో శాఖ (ఆధ్వర్యంలో) నిరంతరం ప్రజల,ఉద్యోగులు సమస్యలపై పోరాడే నాయకులు పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్ధులకు మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుతూ ప్రచారం నిర్వహఙంచారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ ఆటో కార్మిక సంఘం కార్యదర్శి సుధాకర్‌ (రూరల్‌ ఆటో శాఖ) కార్యదర్శి టి, వెంకీ , సభ్యులు మహేష్‌,హరి తదితరులు పాల్గొన్నారు.16వ డివిజన్‌ ప్రాంతంలో సిపిఎం శాఖ నాయకులు కాయం శ్రీనివాసుల ఆధ్వర్యంలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్దుల గెలుపును ఆకాంక్షిస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు.