రొద్దం : ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం మండలంలోని కందుకూర్లపల్లిలో బుధవారం స్థానిక టిడిపి నాయకులు నిర్వహించారు. ఈసందర్భంగా వారు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమం లో టిడిపి జిల్లా అధ్యక్షులు పార్థసారధి, సవితమ్మ, జిల్లా అధికార ప్రతినిధి నరసింహులు, మండల కన్వీనర్ నరహరి, పెనుకొండ నియోజకవర్గం అధ్యక్షులు చిన్నపయ్య, రొద్దం సర్పంచి అశ్వర్థనారాయణ, చంద్రమౌళి,మాధవనాయుడు, చిన్నపరెడ్డి, మురళి, నాగరాజు, పాల్గొన్నారు.
అమడగూరు : మండల పరిధిలోని గుండు వారి పల్లి, మహమ్మదాబాద్ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాసంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి కన్వీనర్ గోపాల్ రెడ్డి, నాయకులు నాగిరెడ్డి, హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
తనకల్లు : మండల పరిధిలోని మల్లిరెడ్డిపల్లి పంచాయతీకి చెందిన మల్లిరెడ్డిపల్లి, ఎర్రబల్లి, పెద్దపల్లి, కురవపల్లి గ్రామాల్లో టిడిపి ఇదేఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో టిడిపి నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందని వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం టిడిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివద్ధి కుంటుపడిందని చెప్పారు. ఇలాంటి పాలనకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, మాజీ ఎంపిపి భూక్యలక్ష్మి, మాజీ మండల కన్వీనర్ శంకర్ నాయుడు, మండల కో కన్వీనర్ బ్రహ్మానంద రెడ్డి, పిజి.మల్లికార్జున, ఎస్సీ సెల్ చిన్నప్ప, రాష్ట్ర ఎస్టీ సెల్ హరి నాయక్, దస్తగిరి వార్డ్ మెంబర్ దామోదర్, ఉత్తన్న నాయక్, సూరి పాల్గొన్నారు.










