6మాట్లాడుతున్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
ప్రజాసమస్యలను పరిష్కరించండి
- టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు:రూరల్ నియోజకవర్గంలో అపరిష్కతంగా ఉన్న ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన సమయంలో సమస్యలను విని పరిష్కరించాలన్నారు. మంగళవారం రూరల్ ఎంఎల్‌ఎ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 'ప్రజల గోడు చెబుతున్నాం వినండి.... జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియానుద్ధేశించి మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా రూరల్ సంబంధించి అనేక సమస్యలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు అధికారుల దష్టికి తీసుకువెళ్లినా నేటికిఅపరిష్కతంగానే ఉన్నాయన్నారు. మరోవైపు రూరల్ లో కుంటుపడిన అభివద్ధి పనులు వినపడేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని చేపట్టామని రూరల్ సమస్యలకు సంబంధించి.. ప్రతి ఒక్కరూ 1902 కు ఫోన్ చేసి చెప్తామన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని పత్రికల నిండా ఫుల్ సైజులో అడ్వర్టైజ్మెంట్ లు ఇచ్చారని, ఎంతోమంది తమ సమస్యల పరిష్కారం కోసం 1902 కు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కలవడం లేదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు మీడియా మిత్రుల సాక్షిగా టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేశారు. అలాగే మీడియా ప్రతినిధులు చుట్టుపక్కల నేతల ఫోన్ ల నుంచి ఫోన్ మార్లు టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసిన ప్రయోజనం లేకుండా పోవడంతో పాటు లైన్ లు బిజీగా ఉన్నాయని సమాధానం వచ్చింది . దీంతో ఆయన మాట్లాడుతూ 1902 పరిస్థితి ఇది అని ఎద్దేవా చేస్తూ ముందు దీనిని సరి చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నేతలు తాటి వెంకటేశ్వర్లు కార్పొరేటర్ మురారి, బద్దెపూడి గిరి మాదిగ, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, షంషుద్దీన్, విజరు కుమార్, రియాజ్, జయవర్ధన్, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గుండాల మధుసూదన్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి సైలేంద్రబాబు, కటకం చైతన్య, తదితరులు పాల్గొన్నారు










