Mar 26,2022 10:44

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం కార్మికుల చైతన్యం కోసం ప్రజాశక్తి దినపత్రిక తీసుకొచ్చిన స్పెషల్‌ ను శనివారం ఉదయం అనంతపురం నగర పాలకసంస్థ 6 సర్కిల్స్‌లో గేట్‌ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు, కార్మికులు ఈ స్పెషల్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అనంతపురం నగర సిఐటియు ఓల్డ్‌ టౌన్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, న్యూ టౌన్‌ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గురురాజ, ముర్తుజా, మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం, మునిసిపల్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు ఏటీఎం నాగరాజు, హాజరై మొత్తం ఆరు సర్కిల్స్‌ లోని కార్మికులకు సమ్మె గురించి క్లుప్తంగా వివరించారు. కార్మికులందరూ సమ్మెకు సంసిద్ధమై విజయవంతం చేయాలని, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను ఉద్దేశించి ప్రజాశక్తి పేపర్‌ ముద్రించిన స్పెషల్‌ పేపర్‌ గురించి కార్మికులందరికీ వివరించి వాటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు బండారు ఎర్రీ స్వామి, సలహా కార్యదర్శి శేషేంద్ర కుమార్‌, కోశాధికారి తిరుమలేశు, సహాయ కార్యదర్శి బత్తల. ఆదినారాయణ, మహిళా కన్వీనర్‌ లక్ష్మీ నరసమ్మ, లక్ష్మీ దేవి, మంత్రి వరలక్ష్మి , కమిటీ సభ్యులు మంజుల, నాగేంద్ర, శీను, శ్రీనివాసమూర్తి, రాఘవేంద్రప్రసాద్‌, నాగభూషణ, అరుణమ్మ, ఆది, జయరాం, నారాయణస్వామి, హిమాంభి, రవి, రేణుక, ప్రభాకర్‌, శివ, ప్రభావతి, రాములమ్మ, లీలావతి, మిగిలిన కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.