క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు
ప్రజాశక్తి కదిరి టౌన్ : కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లిలోనిమ వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తల హరిప్రసాద్ నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజాశక్తి దినపత్రిక ప్రచురించిన 2023 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్తూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్న ప్రజాశక్తి దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు బాహుద్దీన్, వైస్ ఎంపీపీ భర్త ఆదినారాయణ, మాజీ సర్పంచి బత్తల వెంకటరమణ, ముబారక్, బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు.










