Jan 10,2023 21:58

ప్రజాశక్తి క్యాలెండర్‌ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి, తదితరులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ప్రజాసమస్యలను వెలికితీస్తూ నిజాయితీగా, నిర్భయంగా వార్తలను ప్రచురించే సామర్థ్యం ఉన్న పత్రిక ప్రజాశక్తి దినపత్రిక అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ప్రజాశక్తి 2023 నూతన క్యాలెండర్‌ను పట్టణంలోని ఎమ్మెల్యే కేతిరెడ్డి నివాసంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్‌ పత్రికలకు పోటీగా ప్రజాశక్తి దినపత్రిక నిలుస్తూ కార్మిక, కర్షక, విద్యార్ధి, యువజన బడుగు, బలహీన మైనార్టీ వర్గాల ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావటం అభినందనీయమన్నారు. ప్రజాశక్తి దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ జెసిబి రమణ, నాయకులు బాలం గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు