Jan 07,2023 21:23

క్యాలెండర్‌ ఆవిష్కరిస్తున్న అత్తార్‌చాంద్‌బాషా, తదితరులు

కదిరి అర్బన్‌ : ప్రజాశక్తి దినపత్రిక రూపొందించిన 2023 క్యాలెండర్‌ను స్థానిక టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తున్న ప్రజాశక్తి దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బయప్ప, హరి, బాలచందర్‌, ఆనంద్‌, ప్రసాద్‌, సూర్యనారాయణ, బాలాజీ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.