Dec 24,2022 22:13

ప్రజాశక్తి 2023 క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌, తదితరులు

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : 2023 సంవత్సరం ప్రజాశక్తి నూతన క్యాలెండర్‌ను కదిరి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ శనివారం ఆవిష్కరించారు. ఈ మేరకు కందికుంట తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిలచిన ప్రజాశక్తి దినపత్రిక చేస్తున్న కృషిని అభినందించారు.కార్మిక కర్షక పక్షాన నిలుస్తున్న ప్రజాశక్తి దినపత్రిక 2023 నూతన క్యాలెండర్‌ తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళుతూ సమస్యల పరిష్కారానికి తన వంతు పాత్ర పోషిస్తున్న ప్రజాశక్తి దిన పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రెడ్డిబాషా, వడ్డే బాబు, ఇమ్రాన్‌, షాన్వాజ్‌, నాయకులతో పాటు ప్రజాశక్తి విలేకరి హరి తదితరులు పాల్గొన్నారు,