Jan 01,2023 09:14

కందికుంట వెంకటప్రసాద్‌

         కదిరి టౌన్‌ : కదిరి నియోజకవర్గంలో కందికుంట వెంకటప్రసాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అటు సేవా పరంగానూ, ఇటు రాజకీయంగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. అధికారం ఉన్నా, లేకున్నా కదిరి నియోజకవర్గం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నారు. కదిరి నియోజకవర్గ ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నారు. కందికుంట వెంకటప్రసాద్‌ ప్రస్తుతం కదిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై అనునిత్యం స్పందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. పరిటాల రవీంద్ర ప్రోద్భలంతో తెలుగుదేశం పార్టీలో చేరిన ఈయన రెండు దశాబ్ధాలుగా కదిరి నియోజకవర్గం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఏ గ్రామంలో సమస్య అయినా తనదిగా భావించి ఆయన ప్రజల వద్దకు వెళ్తున్నారు. పేదలకు తనవంతుగా నిరంతరం సహాయక సహకారాలు అందిస్తున్నారు. పేదలకు ఆర్థిక సాయం అందించడంలో ముందుండి మానవత్వం చాటుకుంటున్నారు. ఎన్నికల్లో హడావుడి చేసే నాయకునిగా కాకుండా ప్రజలకు పని చేసే వ్యక్తిగా ఆయన్ను ప్రజలు కొనియాడుతున్నారు. కందికుంట రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో కదిరి నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండేది. ఈ సమయంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు నియోజకవర్గంలో ఎన్నో గ్రామాల్లో బోరుబావులు తవ్వించారు. వివాహాలకు ఆర్థిక సాయం అందించారు. మైనార్టీల పక్షపాతిగా ఉంటూ వారికి అండగా నిలిచారు. తన సొంత నిధులు వెచ్చించి షాదీమహల్‌ నిర్మించారు. అధికారంలోఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న సమస్యలపూ అనునిత్యం తపించే వ్యక్తిగా కందికుంట అని ప్రజలు పేర్కొంటున్నారు.
నేడు 'కందికుంట' జన్మదిన వేడుకలు
కందికుంట వెంకటప్రసాద్‌ జన్మదినోత్సవ వేడుకలను జనవరి 1వ తేదీ ఆదివారం నాడు ఘనంగా నిర్వహించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. కదిరి పట్టంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.