మడకశిర రూరల్ : సిఎం జగన్ననని మళ్లీ సీఎం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి కోరారు. మండలంలోని గోవిందాపురం గ్రామ సచివాలయం పరిధి లోని బుధవారం నిర్వహించిన 'గడప గడపకూ మన ప్రభుత్వం'లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి, ఎంపీటీసీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బత్తలపల్లి : ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలు తిరిగి అందాలంటే మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రావాలని ఏపీ కురుబ కార్పోరేషన్ చైర్మన్ కోటి సూర్యప్రకాష్‌బాబు పిలుపునిచ్చారు. బుధవారం బత్తలపల్లిలో మారుతినగర్ లో 'నువ్వే మా నమ్మకం జగన్' అనే కార్యక్రమాన్ని సర్పంచు కాక్కిం కాశమ్మతో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, మరింత అభివద్ధి జరగాలన్నా మరోసారి జగనన్నను సీఎంగా అవకాశం ఇవ్వాలన్నారు. అదేవిధంగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ కరీంసాబ్, సింగిల్‌విండో డైరెక్టర్ ఈడిగ కాశప్ప, షేక్షావలి, బాబాజాన్, షాపు తదితరులు పాల్గొన్నారు.
కదిరి అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని అడపాల వీధి 1,2, సచివాలయాల పరిధిలోని 4, 5వ వార్డులలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డికి ఆయా కాలనీల వాసుల ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రతి గడపను సందర్శించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన కొన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సాయి ప్రణీత్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ప్రకాష్, సాదిక్‌బాషా, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ హరిబాబు, వైస్‌ఛైర్మన్లు,కౌన్సిలర్లు, కో ఆప్షన్స్ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
చిలమత్తూరు : రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వమే వస్తుందని వైసిపి హిందూపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇక్బాల్, ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఈ మేరకు వారు బుధవారం అప్పనపల్లి,పెద్దనపల్లి లో జరిగిన ''జగనన్నే మా భావిష్యత్తు - జగనన్నే మన నమ్మకం'' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో వైసిపి మండల కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
ఓబులదేవర చెరువు : సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజల్లో నమ్మకం రెట్టింపు అయ్యిందని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఓబులదేవర చెరువు పంచాయతీలో సచివాలయం 2 పరిధిలోని మారేవాండ్లపల్లి, బాబా సాహెబ్ పల్లి లో నిర్వహించిన 'గడప గడప మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వీన్ భాను, జెడ్పీటీసీ కుర్లి దామోదర్ రెడ్డి, పట్టణ కన్వీనర్ కోళ్లకృష్ణారెడ్డి, టి కుంట్లపల్లి సచివాలయం కన్వీనర్, (మండల కార్యదర్శి) చంద్రమౌళి నాయుడు, అగ్రి అడ్వైజర్ కమిటీ చైర్మన్ లక్ష్మి రెడ్డి, ఓబుల దేవర చెరువు పంచాయతీ సర్పంచ్ గోవిందు, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం :సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కోన్నారు. బుధవారం పురపాలక సంఘంలో పలు వార్డులో జరిగిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు.










