Jan 11,2023 19:51

మాట్లాడుతున్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

ప్రజాశక్తి-పీలేరు: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పింఛన్ల పంపిణీ ద్వారా నిస్సహాయుల బతుకులకు భరోసా అందిస్తున్నట్లు పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. పంచాయతీ పరిధిలోని పేదలకు కొత్తగా మంజూరైన 140 పెన్షన్లను బుధవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా కొత్త పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ అందివ్వడమే జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకే కాకుండా దీర్ఘకాలిక ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా పెన్షన్‌ అందిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్‌ ఎందరో నిస్సహాయుల జీవిఆనికి ఆసరాగా ఉందని, మరెన్నో కుటుంబాలకు ఆకలి తీరుస్తోందని, ఇంకెందరో దీర్ఘకాలిక రోగులు మందులు కొనుగోళ్ళకు వినియోగించుకుంటున్నారని చెప్పారు. మండల పరిధిలో 9006 సమాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మండలానికి కొత్తగా 305 పెన్షన్లు మంజేరయ్యాయని, వాటిలో ఒక్క పీలేరు పంచాయతీకే 140 పెన్షన్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఇక్బాల్‌ అహమద్‌ ఖాన్‌, స్థానిక పంచాయతీ సర్పంచ్‌ డాక్టర్‌ షేక్‌ హబీబ్‌ బాష, జడ్‌పిటిసి ఏటి రత్నశేఖర్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎండి షఫి, మండల వైస్‌ ఎంపిపి ఎన్‌వి చలపతి, సింగిల్‌ విండో చైర్మన్‌్‌ బిడి నారాయణ రెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి అగా మొహిద్దీన్‌, సాంస్కృతిక, పర్యాటక శాఖ అన్నమయ్య జిల్లా బోర్డు సభ్యులు షేక్‌ షాకీర్‌, మండల కన్వీనర్‌ దండు జగన్మోహన్‌ రెడ్డి, ఏఎంసి మాజీ ఛైర్మెన్‌ కడప గిరిధర్‌ రెడ్డి, మైనార్టీ నాయకుడు అబ్దుల్‌ కలీం, మాజీ ఎంపిపి మహితా ఆనంద్‌, గిడ్డంగుల సంస్థ డైరెక్టర్‌ నాగరాజమ్మ పాల్గొన్నారు.