కదిరి టౌన్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఎగువపల్లి గ్రామ సచివాలయం పరిధిలోని బత్తలపల్లి, హరిజనవాడ, నల్లగుట్ట తండా, దిగువపల్లి, చిన్న దిగువపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. అంతేకాక అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారన్నారు. వీటన్నిటిని చూసి ఓర్వలేని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారని వీటన్నిటినీ ప్రజలు తిప్పి కొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎండి ఇస్మాయిల్, మండల కన్వీనర్ ప్రకాష్, జెడ్పీటీసీ రాధాబాయి, వైస్ ఎంపీపీ ఆనంద్ నాయక్, సర్పంచి ఈశ్వరయ్య, ఎంపీటీసీ శివకుమార్ నాయుడు, సర్పంచులు మణికంఠనాయక్, విశ్వనాథ్, భాస్కర, ఇర్షాద్, ఎంపిటిసిలు మధుకర్ రెడ్డి, కుమార్ రెడ్డి, నరసింహులు నాయక్, సింగల్ విండో అధ్యక్షులు ప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, టెంపుల్ డైరెక్టర్ గరుడప్ప, ఎస్టీ సెల్ కృష్ణనాయక్, లోకేష్, శ్రీనివాస్ నాయుడు, ప్రభాకర్ రెడ్డి, మండల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హిందూపురం : హిందూపురం పురపాలక సంఘం లోనే వెనకబడిన ప్రాంతమైన అంబేద్కర్ నగర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ షేక్ మొహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. 27వ వార్డు అంబేద్కర్ నగర్ లో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయనతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నాగేంద్రమ్మ, కౌన్సిలర్లు మద్దన జయప్ప, మల్లికార్జున, ఈడిగ మల్లికార్జున, అయూబ్, జయప్ప, గిరిష్, మణి, కో-ఆప్షన్ సభ్యులు రహమత్, సునీల్, పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










