కదిరి అర్బన్ : ప్రజాసంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ, కుటాగుళ్ల 2,3 సచివాలయం పరిధిలోని చెరువు కట్ట వీధి, రామస్వామి వీధి, దేవాలయం వీధి, ఎస్సీ కాలనీ, ఆటోనగర్, మెయిన్ రోడ్‌లో శుక్రవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని అక్కడే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్ గంగాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, , కౌన్సిలర్లు మహమ్మద్, ఆవుల స్వామి, మురళి, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల : పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తామని శాసనసభ్యులు శంకర్ నారాయణ తెలిపారు మండలంలోని పాపిరెడ్డి పల్లి, గంగాదేవి పల్లి, బూదిలి తండాలో శుక్రవారం నిర్వహించిన గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రజాసంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ లక్ష్మీనరసప్ప యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచి రామాంజనేయులు, ఎంపీటీసీ మంజునాథ, జెడ్పీటీసీ జయరాం నాయక్, ఎంపీపీ ప్రమీల, సర్పంచులు సరోజా నాగనాయక్, ప్రభాకర్ రావు, వైస్ ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లేపాక్షి : మండలం పరిధిలోని విభూతి పల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని, మాజీ సమయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి, మండల కన్వీనర్ నారాయణస్వామి, జెడ్పీటీసీ బాణాల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచి మంజునాథ్, తహశీల్దార్ బాబు, ఎంఇఒ నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.










