Jun 09,2023 21:35

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌
రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తున్న ఏకైక పార్టీ వైసిపి అని మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా ఆరోపించారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలతోపాటు ఇరుకైన రోడ్లు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మదనపల్లె నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో విద్యుత్‌ ఛార్జీలు విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరిచిన వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్దంగా వున్నారని పేర్కొన్నారు. వైసిపి ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చాక మదనపల్లె పట్టణాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నాదెళ్ల శివ, నాగూర్‌ వల్లి, షంషీర్‌, సంగం హరి, జయన్న, బోరెవెల్‌ నాగరాజ, గిరీష్‌, మల్లి పాల్గొన్నారు. మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా