ఓబుల దేవర చెరువు : రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం తేవడానికి టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నట్లు పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు మంగళవారం 49వ రోజు పాదయాత్ర కదిరి నియోజకవర్గం వదిలి పుట్టపర్తి నియోజకవర్గం లో అడుగుపెడుతున్న సందర్భంగా నారా లోకేష్‌కు టిడిపి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పులగంపల్లి నుంచి మిట్టపల్లి మీదుగా వణుకు వారి పల్లి వరకు పాదయాత్ర కొనసాగిందని చెప్పారు. ఈ పాదయాత్ర 25వ తేదీ వణుకు వారి పల్లి నుంచి ప్రారంభమవుతుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, పరిటాల శ్రీరామ్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నల్లమాడ : యువగళం పాదయాత్రలో భాగంగా నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వేలాదిమంది లోకేష్ కు స్వాగతం పలికారు. కదిరి ఆర్డీవో కార్యాలయం వద్ద విడిది కేంద్రం వద్ద ఉదయం ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర మధ్యాహ్నం మూడున్నర గంటలకు నల్లమాడ మండల పరిధిలోని పులగంపల్లి వద్దకు చేరింది. పులగం పల్లి వద్ద వేలాదిమంది పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు లోకేష్ అభివాదం చేశారు. అక్కడి నుండి ఓబుల దేవర చెరువు మండల పరిధిలోని మిట్టపల్లి వద్దకు పాదయాత్ర చేరింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పరిటాల శ్రీరామ్, మండల కన్వీనర్ మైలే శివశంకర, నాయకులు దున్నికోట కేశవరెడ్డి, అన్నం లక్ష్మీనారాయణ, పుట్ల రవీంద్ర, చిదంబర రెడ్డి, చంద్ర, పాపారాయుడు, సలాం ఖాన్, ప్రకాష్ గౌడ్, పులగంపల్లి సర్పంచి ప్రభాకర్ రెడ్డి, నల్లమాడ సర్పంచి భారతి బారు తదితరులు పాల్గొన్నారు.










