కడప : ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారంచాలని కలెక్టర్ గిరీష అన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి విసి ద్వారా సిఎం జగన్ మోహన్‌రెడ్డి జగనన్నకు చేబుదాం, అర్జీలు, గడప గడపకూ మన ప్రభుత్వం, ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనుల పురోగతి, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్య క్రమంలో భాగంగా గహనిర్మాణ పథకం అమలు తీరు, జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకం, నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠ శాలల అభివద్ధి, సచివాలయ సేవలు తదితర అంశాల్లో ఇప్పటి వరకు సాధించిన పురోగతి మొదలైన అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. విసి అనంతరం కలెక్టర్ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథ కాలను విధిగా లక్ష్యాల సాధనకు అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచే యాలన్నారు. ఈ నెల 23 నుంచి నెలపాటు జగనన్న సురక్షా కార్యక్రమం నిర్వ హించనున్నామన్నారు. జగనన్నకు చెబుదాం వచ్చే వినతుల పరిష్కారంలో క్వాలిటీ అన్నది చాలా ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నామన్నారు. ఒకవేళ గ్రీవెన్స్ రిజెక్ట్ చేస్తే సంబంధిత ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి ఎందుకు రిజెక్షన్ గురైందో వారికి వివరించాలన్నారు. పరిశీలించని గ్రీవెన్స్ ఏమైనా ఉంటే 24 గంటల్లోగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జగనన్నకు చెబుదాం కార్య క్రమానికి అనుబంధంగా ఈ కార్యక్రమం కొనసాగనుందన్నారు. సచివా లయాలు, ఆర్‌బికెలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ గ్రంథాలయాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొరత రాకుండా చూడాలన్నారు. జులై ఒకటి నుంచి ఇ-క్రాఫ్ బుకింగ్ ప్రారంభించాలన్నారు. సెప్టెంబర్ మొదటి వారానికి పూర్తి చేయా లన్నారు. సెప్టెంబర్ నెలకొరుగా తుది జాబితాలను గ్రామ సచివాలయంలో ప్రదర్శించాలన్నారు. సిసిఆర్సి కార్డులపై అవగాహన కల్పించి కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి ఫేజ్ లో 2 వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు భూ రక్ష కార్యక్రమం పూర్తయిందిన్నారు. సచివాలయ స్థాయిలోని రిజిస్ట్రేషన్ సహా అన్ని రకాల సేవలు వీరికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో దశ కింద మరో రెండు వేల గ్రామాల్లో సెప్టెంబర్ 30 కల్లా భూపత్రాలు అందాలిన్నారు. అక్టోబర్ 15 నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ప్రారంభం కావాలన్నారు. జగనన్నకు చెబుదాం, గడప గడపకు మన ప్రభుత్వం పనులు, బిల్లుల అప్లోడ్, ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎస్ పనులు, లేబర్ బడ్జెట్, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, ఎఎంసియులు, బిఎంసియులు, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల భవన నిర్మాణాలు, జగనన్న హౌసింగ్ ప్రోగ్రాం, వ్యవసాయం, నీటి విడుదల, వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో పనిదినాలను ప్రభుత్వ లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కార్యక్రమంలో ఎస్‌పి గంగాధర్‌రావు, జెసి ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డిఆర్‌ఒ సత్యనారాయణ, అదనపు ఎస్పీ డాక్టర్ రాజ్ కమల్, సిపిఒ కృష్ణనాయక్, హౌసింగ్ పీడీ శివయ్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి జయరాజ్, ఇరిగేషన్ జిల్లా అధికారి కృష్ణమూర్తి, డ్రామా పీడీ మద్దిలేటి, పిఆర్‌ఎస్‌టి జయచంద్ర, కలెక్టరేట్ ఎఒ బాలకృష్ణ, వివిధ శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.










