Apr 28,2023 21:22

ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం : కలెక్టర్‌

రాయచోటి : ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ గిరీష అన్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్పందన అర్జీలు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకం, నాడు-నేడు, విద్యా కానుక, సచివాలయ సేవలు తదితర అంశాల్లో సాధించిన ప్రగతి, తదితరాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలతో ముఖ్యమంత్రి సమీక్షించారు. అనంతరం కలెక్టరేట్‌లోని విసి హాలులో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల లక్ష్యాల సాధనకు అధికారులు నిబద్ధతతో ణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. మే నెల 9న ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతగా ప్రారంభించనున్న 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని అదేశించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ స్థాయి నుండి నేరుగా సచివాలయాల పరిధిలో పర్యవేక్షణ చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నడిచేందుకు ప్రత్యేకంగా నియమించిన సీనియర్‌ లెవెల్‌ ఐఎఎస్‌ అధికారులు నెలకు రెండు పర్యాయాలు జిల్లాల్లో పర్యటించి ఈ కార్యక్రమం అమలు తీరును పరిశీలిస్తారన్నారు. ఈ వినూత్న ప్రాజెక్టు విధానం ద్వారా నాణ్యమైన, సంతప్తికరమైన, పారదర్శకమైన పరిష్కారం అందుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 1902 కాల్స్‌ స్వీకరణ, ఐవిఆర్‌ఎస్‌ ఎస్‌ఎంఎస్‌ సందేశం, ఫీడ్‌ బ్యాక్‌, అప్‌ డేట్‌ సమాచారం ఎప్పటికప్పుడు హెల్ప్‌ డెస్క్‌ కంట్రోల్‌ రూమ్‌ నుండి అందుతుందన్నారు. 19,152 గహాలు పూర్తి కావడం జరిగిందని, జగనన్న లెఔట్‌ కాలనీలలో తుది దశలో ఉన్న ఇళ్ళను వెంటనే పూర్తి చేయాలనీ గహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. జూన్‌ నెల 12న పాటశాలలు తెరిచే లోగా జిల్లాకు వచ్చిన జగనన్న విద్యా కిట్లను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పక్కగా పంపిణీ చేయాలన్నారు. మే ఒకటవ తేదీలోగా పాటశాలలకు నైట్‌ వాచ్మెన్‌ నియామకాల ప్రక్రియ పూర్తి చేయాల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌పి గంగాధర్‌రావు, డిఆర్‌ఒ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
- మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష