Jan 06,2023 21:59

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి

కొత్తచెరువు : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో శుక్రవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పల్లె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్‌ శ్రీనివాసులు, మండల కన్వీనర్‌ రామకృష్ణ, టౌన్‌ కన్వీనర్‌ వలిపి శ్రీనివాసులు, నాయకులు బండ్లపల్లి రాజు, డిపో భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.
రొద్దం : రాష్టంలో తుగ్లక్‌ పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారధి విమర్శించారు. శుక్రవారం మండలంలోని నారానాగేపల్లిలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో బికె పాల్గొన్నారు. ప్రజాసమస్యలపై దృష్టి సారించని పెనుకొండ ఎమ్మెల్యే ఏ ముఖం పెట్టుకుని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతున్నారని నిలదీశారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలు పాలకులను నిలదీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి నరసింహులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, నాయకులు చిన్నప్పయ్య, మాధవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మడకశిర : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. శుక్రవారం మండలంలోని మెలవాయి పంచాయతీలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చీకటి జీవోలను తీసుకువచ్చి టీడీపీ సభలను ర్యాలీలను అడ్డుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, నాయకులు మనోహర్‌, నాగరాజు, పాండు రంగప్ప, నారాయణ తదితరులు పాల్గొన్నారు.