Sep 27,2023 20:03

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి -పొదలకూరు :అర్జీదారులు సంతప్తి చెందేలా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్క రించడమే ధ్యేయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌ పేర్కొన్నారు. పొదలకూరు మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం కలెక్టర్‌ హరి నారాయణన్‌, జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్‌ జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన అర్జీలను సంబంధిత అధికారులకు ఇచ్చి నిర్ణీత కాలవ్యవధిలో పరిష్క రించాలని ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మే 9 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారం భించిందని, అందులో భాగంగానే గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు పరి ష్కరించాలనే లక్ష్యంతో మండల కేంద్రాల్లో ముందుగానే షెడ్యూలు ప్రకటించి ప్రతి బుధవారం, శుక్రవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జెడ్‌పి సిఇఒ బి చిరంజీవి, డిపిఒ సుస్మితా రెడ్డి, ఆర్‌డిఒ మలోల, డిఆర్డిఎ, డ్వామా, హౌసింగ్‌ పీడీలు సాంబశివారెడ్డి, నుడా వి సి బాపిరెడ్డి, వెంకట్రావు, నాగరాజు, సర్వే రికార్డుల ఏడి హనుమాన్‌ ప్రసాద్‌, ఐసిడిఎస్‌ పిడి హేనా సుజన్‌, డిఇఓ గంగాభవాని, సిపిఓ ఏఎస్‌ రాజు, పలువురు జిల్లా అధి కారులు, తహశీల్దార్‌ వీర వసంత కుమార్‌, ఎంపిడిఒ నగేష్‌ కుమారి ఉన్నారు.