Oct 19,2022 22:56

ప్రజాశక్తి-నందిగామ 

పట్టణంలోని 13 వ వార్డు పరిధిలో బుధవారం గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహన్‌ రావు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల క్యాలెండర్‌ ను అందజేస్తూ - ప్రభుత్వ పనితీరును వివరించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ కులం- మతం- పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి పేద కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అధికారం చేపట్టిన మూడేళ్లలోనే ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించి -ముందుకు వెళ్తున్నామన్నారు