Nov 13,2023 22:27

ప్రజాశక్తి-కాకినాడ, పెద్దాపురం లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతల్లేని అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి యాత్ర ముగింపు సందర్భంగా నవంబర్‌ 15న విజయవాడలో బహిరంగ సభను జయప్రదం చేయాలని కాకినాడ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఆదివారం కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. స్థానిక రాగంపేటలో ప్రచారం సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు మాట్లాడారు. ఈ ప్రచారంలో సిపిఎం నాయకులు మలకా వెంకట రమణ, సిహెచ్‌.వేణు, నాగలక్ష్మి, తలుపులమ్మ, అవమృత, అభ్యుద్‌ పాల్గొన్నారు.
పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. సిరపరపు శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు మాట్లాడారు. శ్రీనివాస్‌, దారపురెడ్డి కృష్ణ, రొంగల వీర్రాజు, నెక్కల నరసింహమూర్తి, కూనిరెడ్డి అప్పన్న, డి.క్రాంతి కుమార్‌, చల్లా విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.