Jun 02,2023 21:04

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జిల్లా ఆర్థికంగా అభివద్ధి చెందాలంటే పరిశ్రమల స్థాపన విరివిగా జరగాలని కలెక్టర్‌ గిరీష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ విసి హల్లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి అవసరమైన ప్రోత్సాహం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి సత్వరమే అనుమతులను ఇచ్చేవిధంగా కషి చేయాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల స్థాపన కోసం వచ్చిన దరఖాస్తులు ఏ శాఖ వద్దా పెండింగ్‌ ఉండకూడదని, నిర్ణీత కాలవ్యవధిలో వాటిని అనుమతించాలని స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. పిఎంఇజిపి కింద ముందుకు వచ్చే వారికి రుణాలు ఇచ్చేలా చూడాలన్నారు. కొత్త పరిశ్రమ స్థాపన వల్ల జిల్లాకు టాక్స్‌ల ద్వారా వచ్చే రాబడి, కలిగే ఉపాధి, పెట్టుబడి, ఎగుమతి, దిగుమతి వంటి అంశాలను అధికారులు నిశితంగా పరిశీలించాలన్నారు. రిమార్కులు ఏమైనా వుంటే వెంటనే వాటి జాబితాలు సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వేలో ఫీడ్‌ బ్యాక్‌ విషయమై అవగాహన కల్పించాలన్నారు. సింగల్‌ డెస్క్‌ పోర్ట్‌లో మొత్తం అప్లికేషన్‌లు 1503 వచ్చాయని, 1448 దరఖాస్తులు అప్రూవ్‌ అయ్యాయన్నారు. ఇంకా 9 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. జగనన్న బడుగు వికాసం కింద 17 దరఖాస్తులను అప్రూవల్‌ చేయడం జరిగిందన్నారు. ఐడిపి పావలా వడ్డీ స్కీం కింద రెండు దరఖాస్తులను అప్రూవల్‌ ఇచ్చారు. పవర్‌ కాస్ట్‌ ఐడిపి కింద మూడు దరఖాస్తులను అప్రూవల్‌ ఇచ్చారు. సుమారు 14 దరఖాస్తులను వివిధ కారణాల రీత్యా రిజెక్ట్‌ చేశామన్నారు. పిఎంఇజిపి పథకంలో మొత్తం 243 దరఖాస్తుల రాగ 80 శాంక్షన్‌ అయ్యాయని, 141 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. పిఎంఇజిపి పధకం కింద ఆవుల రుణాలు విరివిగా ఇచ్చేందుకు బ్యాంకర్లు కషి చేయాలన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ జె.నాగరాజ, ఎపిఐఐసి జెడ్‌ఎం మూర్తి, ఎల్‌డిఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు.