Jan 30,2023 19:20

చీపురలతో శుభ్రం చేస్తున్న దృశ్యం

చీపురలతో శుభ్రం చేస్తున్న దృశ్యం
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం
నెల్లూరు:వీధులు, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌ స్టేషన్ల వంటి పబ్లిక్‌ స్థలాల్లో పరిశుభ్రత మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని నెహ్రూ యువకేంద్ర జిల్లా అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి పేర్కొన్నారు. శ్రీరామరాజు చారిటబుల్‌ ట్రస్టు,. పినాకిని యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నెల్లూరు మూలపేట లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 'జాతీయ పరిశుభ్రత దినోత్సవం' సందర్బంగా పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ ఈరోజున పరిశుభ్రతలో ఉత్తమమైనవిగా ఎంపిక చేసిన గ్రామాలకు నిర్మల్‌ పురస్కారాలు ఇస్తుంటారని వివరించారు
. శ్రీరామరాజు చారిటబుల్‌ ట్రస్టు సెక్రటరి కె.మురళీమోహన్‌ రాజు మాట్లాడుతూ వ్యక్తి గత పరిశుభ్రత వల్లనే ఎన్నో రోగాలను దూరం చేయగలం. మనిషికి ఆస్తి, అంతస్థులకన్నా ఆరోగ్యంగా ఉండడమే మిన్న. ఒక్క అడుగు స్వచ్ఛత వైపు వేయాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్కూల్‌ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈకార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు యు.పద్మావతి, గౌరవాధ్యక్షులు టి. వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, 220 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.