వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీవిద్య
ప్రజాశక్తి-వాల్మీకిపురం : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా జీవించవచ్చునని మండలంలోని చింతపర్తి పిహెచ్‌సి వైద్యాధికారి శ్రీవిద్య అన్నారు. శనివారం మండలంలో కూరపర్తిలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు పరీక్షలు నిర్వహించి, మందులు, మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇటీవల వర్షాలు కురవడం వలన సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా జీవిస్తామన్నారు. అనంతరం కరోనా నివారణ, లక్షణాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ సుధాకర్, ఎంఎల్‌హెచ్‌పి రమ్యశ్రీ, ఆశవర్కర్లు పాల్గొన్నారు.










