Dec 23,2022 21:43

కాలనీలో పరిసరాలను పరిశీలిస్తున్న డిఎంహెచ్‌ఒ, తదితరులు

పుట్టపర్తి అర్బన్‌ : ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్‌వి కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక వైద్య సిబ్బందితో కలసి పట్టణంలోని సాయి నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మురుగునీటి నిల్వలు ఉండరాదని వారానికి ఒకసారి నీటి తొట్టెలను శుభ్రంగా చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ నగేష్‌, జిల్లా మలేరియా యూనిట్‌ అధికారి కుళ్లాయప్ప నాయక్‌, ఎఎంఒ లక్ష్మీ నాయక్‌, వైద్య సిబ్బంది రమణమ్మ, అనుపమ, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.