చిత్రపటానికి పూలమాలేస్తున్న ఎస్‌పి
పరిపాలనాదక్షుడు 'బాబూ జగజ్జీవన్‌రామ్'
నెల్లూరు:ప్రజల ఆశా జ్యోతి, రాజనీతిజ్ఞడు, పరిపాలనాదక్షుడు, దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ అని ఎస్‌పి సిహెచ్ విజయరావు పేర్కొన్నారు. బుధవారం బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం ఎస్‌పి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ మానవతావాదం, ఆదర్శవాదం వంటి పలు సద్గుణాలు కలిగిన మహౌన్నత వ్యక్తి కావడం వల్ల ఆ మహానుభువుడిని దేశ ప్రజలు ఆప్యాయంగా ''బాబూజీ'' అని పిలిచేవారన్నారు. అంటరానితనం పై ఉక్కుపాదం మోపి, దేశ ప్రజలను సంఘటితం చేసిన గొప్ప దార్శనికులు. ఎంతో మందికి మార్గదర్శకుడైన అజాత శత్రువన్నారు. మొదటి మహిళా లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ తండ్రి బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. అంతటి ఉన్నతమైన వ్యక్తి జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు నమస్సుమాంజలు అర్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ స్వాతంత్య్ర సమరయోధుదిగా, సంఘసంస్కర్తగా, పట్టుదల, వారు చేసిన త్యాగాలకు గుర్తుగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ ల యందు స్మరించుకోవాలన్నారు.










