Mar 20,2023 21:43

ఫొటో : పరీక్షా కేంద్రాలను పరిశీలిస్తున్న ఎంఇఒ మస్తాన్‌వలీ

పరీక్ష కేంద్రాల్లో పరిశీలన
ప్రజాశక్తి-ఉదయగిరి : పదవ తరగతి పరీక్ష కేంద్రాల ఏర్పాటును మండల విద్యాశాఖ అధికారి షేక్‌ మస్తాన్‌ వలీ పరిశీలించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో జరుగునున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 3వ తేదీ నుండి 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరుగుచున్న నేపథ్యంలో ఎంపికైన సెయింట్‌ మేరీస్‌ ప్రయివేటు ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని భౌతిక వసతులైన బిల్డింగ్స్‌, డ్యూయల్‌ డస్క్‌లు, ఫర్నిచర్‌, కాంపౌండ్‌ వాల్‌, తాగునీటి సదుపాయము, టాయిలెట్స్‌, ఎలక్ట్రిసిటీ, ట్యూబ్లైట్స్‌, ఫాన్స్‌ ఇతర సదుపాయాలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉన్నాయో లేదా అని పరిశీలించారు.
రెండు మూడు రోజుల లోపల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా డ్యూయల్‌ డెస్క్‌లు, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్స్‌ ఏర్పాటు చేసుకోవాలని సిబ్బందికి తెలియజేశారు. తదుపరి తరగతుల వారీగా విద్యార్థుల పఠన అభ్యసన నైపుణ్య సామర్ధ్యాలను పరిశీలిచి పాఠశాల విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు పట్టిలను, సిసిఇ రిజిస్టర్లను పరిశీలిస్తూ రికార్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెడ్‌మిస్‌ సిస్టర్‌ రాజశ్రీ, ఉపాధ్యాయులు నాగవర్ధన్‌ పాల్గొన్నారు.