May 11,2023 21:02

- సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జిల్లాలో సుస్థిరాభివద్ధి లక్ష్యాలలో వందశాతం ప్రగతి సాధించేందుకు కషి చేస్తున్నామని కలెక్టర్‌ గిరీష పి.ఎస్‌. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌. జవహర్‌ రెడ్డికి వివరించారు. గురువారం వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి సుస్థిర అభివద్ధి లక్ష్యాలు నాడు- నేడు, జగనన్న విద్యా కానుక కిట్లు, స్పందన అర్జీల పరిష్కారం, గ్రామ వార్డు సచివాలయాలు తదితర అంశాలలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు రాయచోటి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అధికారులతో కలెక్టర మాట్లాడుతూ సుస్థిరాభివద్ధి లక్ష్యాల సాధనలో ముఖ్యమైన 8 అభివద్ధి సూచికల్లో నిర్దేశించిన లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు. ఇందులో భాగంగా ముఖ్యంగా అనీమియా నివారణకు ముమ్మరంగా చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల్లో రక్తహీనత ఉన్నవారిని గుర్తించి వారిలో హిమోగ్లోబిన్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ బరువు ఉన్న పిల్లలపై ఐసిడిఎస్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎన్‌సిడి సర్వేలో భాగంగా ఆధార్‌ కరెక్షన్‌ చేయడానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి ఉచిత ఆరోగ్య సేవలు అందించేందుకు కషి చేస్తుందని, ఆ దిశగా అధికారులందరూ కూడా పనిచేయాలన్నారు. ఎఎన్‌ఎం , ఆశ వర్కర్స్‌ ప్రతి ఇంటిని సందర్శించి ఆరోగ్య పరీక్షలు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్లో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది నియామకం త్వరగా చేపట్టాలన్నారు. శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని చెప్పారు. చిన్నపిల్లల ఆధార్‌ అప్డేషన్‌ మీద ప్రత్యేక దష్టి సారించాలన్నారు. పాఠశాలల అభివద్ధిలో నాడునేడులో భాగంగా ప్రతి పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్‌ తదితర ప్రాథమిక మౌలిక వసతులు ఉండాలన్నారు. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరిచిన వెంటనే జగనన్న విద్యా కానుక కిట్లను ప్రణాళిక బద్ధంగా విద్యార్థులకు పంపిణీ చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.
స్టోన్‌ ప్లాంటేషన్‌ ప్రక్రియ వందశాతం పూర్తి చేస్తాం
వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద జిల్లాలో మొదటి దశలో రీసర్వే చేపట్టిన 84 గ్రామాల్లో ఈనెల 20 లోగా స్టోన్‌ ప్లాంటేషన్‌ ప్రక్రియను వందశాతం పూర్తి చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. గురువారం విజయవాడ సిసిఎల్‌ఏ కార్యాలయం నుండి వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం, భూ హక్కు పత్రాలు, భూ రక్షా స్టోన్స్‌, గ్రౌండ్‌ టూ థింగ్‌ ప్రక్రియ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో సిసిఎల్‌ఎ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.సాయి ప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మేరకు జిల్లాలో మొదటి దశలో రీ సర్వే పూర్తి చేసిన 84 గ్రామాలలో హద్దురాళ్లను పాతించడం జరుగుతోందన్నారు. ఇంకా కేవలం 5, 6వేల రాళ్లు మాత్రమే పాతించాల్సి ఉందని, మరో నాలుగు ఐదు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అలాగే రెండో దశ రీసర్వే చేపట్టిన గ్రామాలలో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ సత్యనారాయణ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ జయరాజ్‌ పాల్గొన్నారు.