Dec 31,2022 20:08

ఫొటో : ఉపాధ్యాయుడికి సన్మానం చేస్తున్న ఉపాధ్యాయులు

ప్రధానోపాధ్యాయునికి ఘన సన్మానం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని చుంచులూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందిన పారంశెట్టి పద్మాకర్‌ను శనివారం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు రమేష్‌ మాట్లాడుతూ 37 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో పలు పాఠశాలల్లో ఎంతో నిబద్దతతో, అంకితభావంతో పనిచేసి, ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దారన్నారు.
ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి చుంచులూరు ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని వారి సేవలను ఘనంగా కొనియాడారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ విష్ణుకుమార్‌రెడ్డి, ఎంఆర్‌జి రాజేంద్రకుమార్‌, పాఠశాల ఉపాధ్యాయులు మురళీకృష్ణ, అశోక్‌, రేవతి, రబ్బాని, మాధవరావు, సురేంద్ర, ఖాజా రసూల్‌, విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.