Apr 28,2023 22:14

ఫొటో : మాట్లాడుతున్న ఎంఇఒ మస్తాన్‌వలీ

ప్రధానోపాధ్యాయులతో ఎంఇఒ సమీక్ష
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రధాన ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో చేపట్టాల్సిన నియమ నిబంధనలపై సమీక్ష సమావేశాన్ని ఎంఇఒ షేక్‌.మస్తాన్‌ వలీ నిర్వహించారు. శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి అధ్యక్షతన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వేసవి సెలవు సంబంధించి విద్యార్థులు పాటించాల్సిన నియమ నిబంధనలు, సోషల్‌ ఆడిట్‌కు సంబంధించిన శిక్షణ కార్యక్రమం, మనబడి నాడు-నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జూన్‌ 5 లోపల అన్ని రకాల కాంపోనెంట్స్‌ సంబంధించిన పనులు పూర్తి చేయవలెనని, శనివారం మెగా పేరెంట్స్‌ మీటింగ్‌లో ప్రతి విద్యార్థి ప్రతిభ, వార్షిక ప్రగతిని తెలియజేసి తల్లిదండ్రుల సమక్షంలో వార్షిక ప్రగతి కార్డులను అందజేయలన్నారు. సమావేశంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.