Apr 22,2023 21:28

ఫొటో : మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటా లక్ష్మిపతి

ప్రధాని మోడీని గద్దె దింపాలి
ప్రజాశక్తి-ఆత్మకూర్‌ అర్బన్‌ : ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలను అనుసరిస్తున్న ప్రధాని మోడీని ఇంటికి సాగనంపాలని కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటా లక్ష్మిపతి ఆధ్వర్యంలో శనివారం మండలంలోని మురుగళ్ల ఎస్‌సి కాలనీలో ప్రచారభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆదాయాన్ని తెస్తున్న ప్రభుత్వంగా సంస్థలన్నింటినీ తన ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విత్తనాల వల్లే దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందని తెలియజేశారు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రజలకు చేసిన విభజన హామీలు అమలు చేయకుండా ఏపీని అధోగతి పాలు చేస్తుందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన మతోన్మాద బిజెపిని సాగనంపుదాం.. దేశాన్ని కాపాడుకుందాం.. అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మురగళ్ల శాఖ కార్యదర్శి రాము, నాయకులు వెంకటేశ్వర్లు, పెంచలయ్య, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.