Jul 07,2021 17:57

హైదరాబాద్‌ : బుల్లితెరపై స్టార్‌ యాంకర్లుగా శ్రీముఖి, ప్రదీప్‌ దూసుకుపోతున్నారు. వీరిద్దరూ జంటగా చేసిన షోలు టీఆర్పీ రేటింగ్‌లోనూ టాంప్‌ రేజ్‌ంలు ఉంటాయి. మరి టిఆర్‌పి రేటింగ్‌లో అదరగొడుతున్న ఈ జంట.. నిజ జీవితంలో పెళ్లిపీటలెక్కనున్నారని కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంతకముందే ఇలాంటి వార్తలొచ్చినా.. వీటిని ఈ జంట అదేమీ లేదని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా శ్రీముఖి ప్రదీప్‌పై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టేసింది. దీంతో మళ్లీ ఈ వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ షోలో అందరూ చూస్తుండగానే శ్రీముఖి.. ప్రదీప్‌కి ఐలవ్యూ అంటూ ప్రపోజ్‌ చేసింది. ఆమె షోలో 'అందాలలో అహో మహోదయం' అనే పాటతో ఎంట్రీ ఇచ్చి.. సిగ్గుపడుతూ ప్రదీప్‌వంక చూస్తూ.. ఐలవ్యూ అంటూ.. మనసులో మాట చెప్పింది. ఇలా శ్రీముఖి చెప్పగానే ప్రదీప్‌ కూడా సరే అన్నట్లుగా సిగ్గుపడుతూ.. ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొందరు కామెంట్‌ చేస్తుంటే.. కేవలం షో కోసమే ఇలా చేస్తున్నారేమో అంటూ మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.