జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకుంది. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పిడిఎఫ్ అభ్యర్థులు స్పష్టమైన విధానాలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు వ్యూహాత్మక ఎత్తుగడలతో పైచేయి సాధించడానికి ఆరాటపడుతున్నారు. ఎన్నికల బరిలో దిగిన 51 పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతు మీద ఆశలు పెంచుకున్న అభ్యర్థులు ఆయా పార్టీల కేడర్, ప్రలోభాలపై ఆశలు పెంచుకుని ప్రచారం సాగిస్తుండడం గమనార్హం. ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 39 మంది పట్టభద్ర స్థానానికి, 12 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బరిలో దిగిన సంగతి తెలిసిందే. పిడిఎఫ్ తరుపున పట్టభద్ర స్థానానికి పోతుల నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కత్తి నరసింహారెడ్డి పోటీ చేస్తున్నారు. పిడిఎఫ్ అభ్యర్థులిద్దరూ మండలి పరిధిలోని ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారం సాగి స్తున్నారు. రాయలసీమ ఎడారి సీమగా మారిన నేప థ్యంలో పిడిఎఫ్ అభ్యర్థులు స్పష్టమైన విజన్‌తో సీమ సమస్యలను ప్రస్తావిస్తూ ప్రచారం సాగి స్తున్నారు. సోషల్ మీడియా, కరపత్రాలు, ఉద్యోగ సంఘాల యూనియన్లు, ప్రజా సంఘాల సహకారంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ప్రధాన పార్టీల కేడరే సర్వస్వం
అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతు పొందిన అభ్యర్థులు పార్టీ కేడర్‌లతో వరుసగా సమావేశాలు నిర్వహించడం, వాటిపై ఆధారపడి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. వైసిపి అభ్యర్థి ఎమ్మెల్యేల సహాయంతో పార్టీ కేడర్‌లతో సమా వేశాలు నిర్వహించడం, ప్రయివేటు స్కూళ్ల యాజ మాన్యాలపై ఆధారపడడం తెలిసిందే. ప్రచార ప్రారంభ సమయంలోనే టిఫిన్ బాక్సుల ప్రలో భాలకు తెరతీయడం వంటి అనైతిక పద్ధతుల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని సాగించడం తెలిసిందే. టిడిపి అభ్యర్థి రిజిష్టర్ పోస్టుల ద్వారా ఓటర్లను అభ్యర్థించడం, పార్టీ కేడర్‌పై ఆధారపడి ఎన్నికల ప్రచారం సాగించడం వంటి విధానాలతో ముందు కెళ్తుండడం గమనార్హం. ఏదేమైనా ఎన్నికల ప్రచార ంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుపై ఆధార పడిన అభ్యర్థులు తమను గెలిపిస్తే ఫలానా లక్ష్యా లను సాధిస్తామని స్పష్టంగా ఓటర్లకు హామీలు ఇవ్వడం లేదు.
ప్రధాన పార్టీల నాయకుల వరుస పర్యటనలు
ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్‌గా భావిస్తుండడం అధికార, ప్రతిపక్ష పార్టీలకు కత్తిమీద సాములా మారినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు, టిడిపి పరిశీ లకులతోపాటు తాజాగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచెన్నాయుడు, వామపక్షాల రాష్ట్ర నాయకులు ఎని ్నకల ప్రచారాల్ని పర్యవేక్షించడం ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం ఉత్కంఠను కలిగిస్తుండడం గమనార్హం. అన్ని పార్టీలు తమ కేడర్‌ను సమాయత్తం చేస్తుం డడం ఎన్నికల వ్యవహారం వేడెక్కింది.
ప్రధాన పార్టీలకు పట్టని ప్రాజెక్టులు
అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతు పొందిన అభ్యర్థులు సీమ సమస్యలు పట్టని వాతా వరణం కనిపిస్తోంది. రాయలసీమ వెనుక బాటు తనానికి ఫలానా సమస్యలు కారణమని చెప్ప కపోవడం, ఫలానా పరిశ్రమలను తెచ్చేందుకు కృషి చేస్తామని ప్రచారం చేయక పోవడం గమనార్హం. జిల్లాలో జిఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-2లోని ఒకటి, మూడు మినహా మిగిలిన ఐదు ఫ్యాకేజీలు కోల్డ్‌స్టోరేజీకి పరి మితం కావడం తెలిసిందే. జిఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్- 2లో మొగమేరు అక్విడక్ట్ నిర్మాణం వెక్కి రిస్తోంది. ఇటువంటి ప్రధాన సమస్యను విస్మ రిం చడం క్షంతవ్యం కాని పని. యురేనియం నిర్వా సిత గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిం చడంలో ఏళ్లూపూళ్లూ గడిచిపోతున్న సంగతి తెలి సిందే. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇటువంటి ప్రధా న సమస్యలను మాటమాత్రమైనా ప్రస్తావించడం లేదు.
'సీమ' సమస్యలే పిడిఎఫ్ అజెండాగా..
పిడిఎఫ్ అభ్యర్థులు రాయలసీమ కన్నీటిని తుడవడానికి మండలిలో గళం వినిప ిస్తామని ప్రచారం సాగించడం ఆకట్టు కుంటోంది. జిఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-2 పనుల దగ్గర నుంచి గండికోట, సోమశిల నిర్వాసితుల పరిహారం, మొ గమేరు ఆక్టిడక్ట్ పనుల పెండింగ్, కెసికెనాల్ ఆయ కట్టు స్థిరీకరణ, సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరి శ్రమ, కొప్పర్తిలో పరిశ్రమల ఏర్పాటు, యురేనియం విస్తరణ దుష్ప్రభావం, బ్రహ్మసాగర్, సర్వ రాయసాగర్, వామికొండ, చిత్రావతి లీకేజీలు వంటి సమస్యలై ముందుకు వెళుతున్నారు. సీమ జిల్లాల్లోని పెండింగ్ ప్రాజెక్టులు, పరిశ్రమల సాధనకు పాటుపడతామని ఎన్నికల ప్రచారం సాగించడం ఓటర్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఏదేమైనా పోలింగ్ నాటికి ఓటింగ్ పోలరైజే షన్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సి ఉంది.










