Feb 16,2023 20:30

ఇదేమి కర్మ కార్యక్రమంలో రమేష్‌రెడ్డి

ప్రజాశక్తి-రాయచోటి : సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 16వ వార్డులో ఇదేమి కర్మ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ టిడిపి పాలనలో చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. పేదలు, రైతులను ఆదుకున్న ఘనత టిడిపిదేనని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందన్నారు. సొంత బ్రాండ్లతో మద్యం అమ్ముతూ పేదలను అన్యాయం చేస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసిపి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే పేద బలహీన వర్గాలలో వెలుగు నింపాలంటే వైసిపి పాలన పోయి తెలుగుదేశం పార్టీ పాలన రావాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి కక్ష సాధించడం వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేక విలవిలలాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్క ఉద్యోగమైన ఇచ్చారా, ఒక్క పరిశ్రమ అయినా రాష్ట్రానికి వచ్చిందా అంటూ ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాష, పట్టణ అధ్యక్షులు బోనమాల ఖాదర్‌వలి, రూరల్‌ అధ్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, మాజీ కౌన్సిలర్‌ మహబూబ్‌ భాష ,సయ్యద్‌ ఫజిల్‌, సర్దార్‌ వలీఖాన్‌, అత్తర్‌ జావిద్‌, శేషి జావిద్‌, ఇలియాజ్‌, ఫరూక్‌, సోనిరాజ్‌ కలిమ్‌,ముబారక్‌, అబీద్‌, హాజీ, మహబూబ్‌ భాష, రామకృష్ణగౌడ్‌, సయ్యద్‌ ఖాన్‌, మీథేన్‌, జావిద్‌, శివారెడ్డి, దుర్గ, ప్రభాకర్‌ పాల్గొన్నారు.