ప్రభుత్వంపై బీద గిరిధర్ ఆగ్రహం
ప్రజాశక్తి-అల్లూరు : గిరిజనులకు చెందిన కార్పొరేషన్ నిధులను సర్వం దోచుకున్నారని మాజీ జెడ్‌పిటిసి బీద గిరిధర్ అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తపరిచారు. ఆదివారం మండలంలోని చింతకుంట, చాకిరేగుంట గ్రామాలలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రాన్ని కార్యక్రమాన్ని చేపట్టగా అనేక పలు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దేశ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు అభివృద్ధి చెందారని వెల్లడించారు. మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచారన్నారు. జగన్మోహన్ రెడ్డి అంతా దోచుకుంటూ కల్లబొల్లి హామీలు చెప్పడం తప్ప ఇంకేమీ లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తప్ప ఈ ప్రభుత్వంలో ఏనాడు అభివృద్ధి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.










