ప్రజాశక్తి - తిరువూరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ ఎం.సుహాసిని తిరువూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని.ఆదివారం సందర్శించారు. వార్డులలో చికిత్స పొందుతున్న జ్వరపీ డుతులతో ఆమె మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రా మాల నుండి మొత్తం 11 మంది సాధారణ జ్వరాలతో బాధపడే వారేనని ఆసుపత్రి సూపరిండెంట్ గార్గేయ వివరించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల, ప్రభుత్వాసుపత్రి వైద్యులకు జిల్లా శాఖాధికారిణి పలు సూచనలు చేశారు. సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తం గా ఉడాలని, అన్ని గ్రామాల్లో పారిశు ధ్య పనులు, దోమ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని ప్రయి వేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య సిబ్బందితో ప్రతిరోజూ జ్వర పీడుతుల గుర్తింపు సర్వే నిర్వహించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధి కారి డాక్టర్ మోతిబాబు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు కళ్యాణ్ చక్రవర్తి, నర్సింహా నాయక్, షాకీన్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.










