Aug 29,2023 23:06

భవానీపురంలో సమరబేరి పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి - జగ్గయ్యపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అధిక ధరలు, విద్యుత్‌ ఛార్జీలు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా జరిగే సమర భేరి కార్యక్రమంలో పాల్గొని, జయప్రదం చేయాలని సిపిఎం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఎన్‌సిహెచ్‌.శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని డివిఅర్‌ నగర్‌లో గల సుందరయ్య భవన్‌లో సమరభేరిని జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్‌ సిహెచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ, మండల కార్యదర్శి సోమోజు నాగమణి, నాయకులు పాల్గొన్నారు.
భవానీపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలు, నిరుద్యోగం, కరెంటు గ్యాస్‌ రేట్లు, నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగే సమరభేరి కార్యక్రమంలో భాగంగా సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్‌ 4వ తేదీన కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం పశ్చిమ సిటీ కార్యదర్శి బోయి సత్యబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలోని 44, 45 డివిజన్ల ఆధ్వర్యంలో లేబర్‌ కాలనీ, కొండ బడి ప్రాంతంలో సిపిఎం పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రచార కార్యక్రమం, ఇంటింటికి ప్రజలకు కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమర భేరి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ ప్రచారంలో నగర కమిటీ నాయకులు పాల్గొన్నారు.
తిరువూరు : సమరభేరి వాల్‌ పాస్టర్లను తిరువూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం పట్టణ కమిటీ నాయకులు కార్యకర్తలు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి మేకల నాగేంద్ర ప్రసాద్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.
నందిగామ : పెంచిన కరెంటు ఛార్జీలు నిత్యవసర వస్తువు ధరలు తగ్గించాలని నందిగామ 18వ వార్డులో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం సంతకాల సేకరణ చేపట్టారు. సిపిఎం ఎన్టీఆర్‌ జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు పాల్గొన్నారు.
అజిత్‌సింగ్‌నగర్‌ : బాంబే కాలనీలో మంగళవారం విద్యుత్‌ చార్జీల అదనపు భారాలపై, పెరిగిన నిత్యవసరాల అధిక రేట్లు పై, సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం ఆధ్వర్యంలో 4వ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రతి డివిజన్‌ ప్రతి ఏరియాలో సంతకాల సేకరించి నాలుగో తేదీన కలెక్టర్‌ కార్యాలయాల దగ్గర మహా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది.
ఇబ్రహీంపట్నం : సమరభేరి గోడపత్రికను సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. కొండపల్లి సిపియం టౌన్‌ సెక్రటరీ యం మహేష్‌ పిలుపు నిచ్చారు. ప్రజలను పీడిస్తున్న అధిక ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎ విఠల్‌ రావు, ఇ కొండలరావు, మల్లెల సాంబశివరావు, షేక్‌ బాషా,కె కోటేశ్వరరావు, పి.బాబూరావు పాల్గొన్నారు.(ప్ర.వి)