ప్రజాశక్తి-పెనుకొండ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడదామని టిడిపి జిల్లా అధ్యక్షులు బికె పార్థసారధి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో డిసెంబర్ 2 నుంచి చేపట్టనున్న ఇదేంకర్మ - మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని పోస్టర్లను గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సిఎం జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అభివృద్ధిని మరిచి కేవలం ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రానికి పట్టిన గతిని ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, జిల్లా అధికార ప్రతినిధులు రొద్దం నరసింహులు, రఘవీరాచౌదరి, సీనియర్ నాయకులు రామకిష్టప్ప, అశ్వర్థనారాయణ, మండల కన్వీనర్ సిద్ధయ్య, టౌన్ కన్వీనర్ రవిశంకర్, నాయకులు శ్రీనివాసులు, రామలింగానాయుడు, టౌన్ మహిళా కన్వీనర్ గాయత్రి, నాయకురాలు చంద్రకాంతమ్మ, ఖదీర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : రాష్ట్రంలో కొనసాగుతున్న నియంతపాలనను అంతమొందించడానికి ప్రజలందరి భాగస్వామ్యం చాలా అవసరమని టిడిపి నాయకులు పిలుపునిచ్చారు. వైసిపి పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జిల్లావ్యాప్తంగా 45 రోజుల పాటు నిర్వహించనున్న 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' అనే కార్యక్రమాన్ని సంబంధించిన పోస్టర్లను గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా టిడిపి శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజలపై మోపుతున్న భారాలపై చర్చించడంతోపాటు స్థానిక సమస్యలు తెలుసుకుని ప్రజలకు అండగా ఉండనున్నట్లు తెలిపారు. మద్యం, ఇసుకదందా, నిరుద్యోగ సమస్య, ఇంటి పన్ను, కరెంటు సమస్య, డీజిల్, పెట్రోల్, నిత్యావసరుకుల ధరలు పెరగడం తదితర అంశాలపై ప్రజలతో చర్చించి వారి బాధలను పంచుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్, చింతలపల్లి మహేష్‌చౌదరి, బోయ రవిచంద్ర, పరిశే సుధాకర్, పురుషోత్తంగౌడ్, మేకల రామాంజినేయులు, పోతుకుంట లక్ష్మన్న, భీమనేని ప్రసాద్‌నాయుడు, నాగూర్‌హుస్సేన్, రాంపురం శీన, రాళ్లపల్లి షరీఫ్, ఆంబటి సనత్, గంగారపు రవి, గోసల శ్రీరాములు, పల్లపు రవీంద్ర, టైలర్ కుళ్లాయప్ప, కరెంటు ఆది, కేతినేని రాజ, కేశగాళ్ల శీన, చట్టా లక్ష్మీనారాయణ, మహిళా నాయకురాలు, సాహెబ్బీ, బీబీ తదితరులు పాల్గొన్నారు.
ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి పోస్టర్లను విడుదల చేస్తున్న టిడిపి నాయకులు










