ప్రభుత్వ వైద్యశాలలో డెంగీకి చికిత్స
ప్రజాశక్తి-అల్లూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో డెంగీ జ్వరానికి సంబంధి అరుదైన చికిత్సను చేసినట్లు శనివారం హాస్పిటల్ సూపరిండెంట్ డిప్యూటీ సివిల్ సర్జన్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందుపూరు గ్రామానికి చెందిన నాటక రాణిలక్ష్మి(35) అనే మహిళ 16వ తేదీ డెంగీ ఫీవర్‌తో వైద్యశాలకు రాగా ఆమెను అడ్మిషన్ చేసుకున్నట్లు వివరించారు. వైద్య పరీక్షలు నిమిత్తం రక్త కణాలు 30 వేలకు పడిపోయి విపరీతంగా కళ్లు ఎర్రబారి పోయాయని తెలియజేశారు. హుటాహుటిన ఆమెకు వైద్య సేవలు అందించి లక్షా 85 వేలకు రక్త కణాలు చేరుకున్నాయని హర్షం వ్యక్తం చేశారు. అపోహలు తొలగించుకొని ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి ఒక్కరు విస్తృతంగా వైద్య సేవలు పొందాలని ఆకాంక్షించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 24 గంటలు అల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర సేవలు అందిస్తున్నామన్నారు. వైద్యులు సిబ్బంది ఎవరైనా వైద్యంపై అలసత్వం వహిస్తే వెంటనే తనకు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజలకు సేవలందించేందుకే తామున్నామని వెల్లడించారు.










