ప్రజాశక్తి-హిందూపురం : సచివాలయాల పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి సక్రమంగా అందించేలా కషి చేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సచివాలయ ఉద్యోగులకు ఆదేశించారు. మంగళవారం హిందూపురం మండలంలోని మలగూరు, బాలంపల్లి సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా సచివాలయాల పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి వారు లబ్ధి పొందేలా చూడాలన్నారు. ఆయా సచివాలయాలకు వస్తున్న సర్వీసులను ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ నరేంద్ర, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఏర్పాటుకు భవనాల పరిశీలన
ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఏర్పాటుకు భవనాలను పరిశీలించారు. పట్టణంలో ఉన్న సిరికల్చర్ ఎడి ఆఫీస్ హాస్టల్ భవనాన్నికలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిరికల్చర్ జెడి పద్మమ్మ, బిసి వెల్ఫేర్ డిడి, ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.










