బత్తలపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం పని చేస్తోందని ఎంపిపి గుర్రం వనజ, సంజీవపురం, దంపెట్ల సర్పంచులు కమతం వరలక్ష్మీ, చల్లా కరుణాకర్ నాయుడు పేర్కొన్నారు. శనివారం మండలంలోని సంజీవపురం కేజీబీవీ, దంపెట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. కేజీబీవీలో 39 మందికి, డంపెట్ల పాఠశాలలో ఐదు మందికి ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగరత్నబాయి, వైసిపి నాయకులు కమతం ఈశ్వరయ్య, బండి వీరనారప్ప, విశ్వనాథగుప్తా, మహేష్, శ్రీలక్ష్మీ, కార్యదర్శి భారతితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










