Sep 25,2023 20:59

జెండా అవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-గుడ్లూరు :ప్రభుత్వ పాఠశాల విద్యను కాపాడుకోవాల్సిన అవసరముందని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, కార్యదర్శి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అక్టోబర్‌ ఒకటి నుంచి విజయవాడలో జరగనున్న యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాల సన్నాహక సభ జయప్రదం చేయాలని కావలి నుంచి గుడ్లూరు వచ్చిన యుటిఎఫ్‌ ప్రచార జాతాకి కి గుడ్లూరులో ఉపాధ్యాయులు ఘన స్వాగతం సోమవారం పలికారు.స్థానిక ఎంఈఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ చేశారు .ఈ సందర్భంగా యుటియఫ్‌ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను కాపాడుకోవడానికి ప్రతి ఉపాధ్యాయుడు కషి చేయాలన్నారు. మండల యూటీఎఫ్‌ నాయకులు 60 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు