పుట్టపర్తి అర్బన్ : నూతన జిల్లాలో వివిధ ప్రభుత్వ భవన నిర్మాణాలకు స్థల సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. ఎనుములపల్లిలో ప్రభుత్వ ప్రభుత్వ భూములను గుర్తించారు. పెరేడ్ గ్రౌండ్ వద్ద గల ప్రభుత్వ భూములు, నిరుపయోగంగా ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలను, షాదీ మహల్ దగ్గర ఉన్న 11 ఎకరాల భూమిని కలెక్టర్ పరిశీలించారు. రెడ్ క్రాస్ భవన నిర్మాణానికి, రైతు బజారు, స్కిల్ డెవలప్మెంట్, టూరిజం భవన నిర్మాణాలకు అవసరమైన స్థల సేకరణకు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం 26న గణతంత్ర దినోత్సవ వేడుకలకు పేరేడ్ గ్రౌండ్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌పి రామకృష్ణ ప్రసాద్, తహశీల్దార్ నవీన్ కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి, పుడా విసి నవీన్‌కృష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ అధికారి విశ్వనాథరెడ్డి, డిఎంహెచ్‌ఒ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.










