Aug 05,2022 22:44

పెనుగంచిప్రోలు: ప్రభుత్వ భవనాల నిర్మాణం లను వెంటనే పూర్తిచేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీ రావు పేర్కొన్నారు. స్థానిక ఆర్‌ కె ఫంక్షన్‌ హాల్‌లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివద్ధి కార్యక్ర మాలు, ప్రభుత్వ భవన నిర్మాణాల ప్రగతిపై శుక్రవారం ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను లతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివద్ధి నిర్మాణాలు, ప్రభుత్వ భవన నిర్మాణాలపై అధికారులు అశ్రద్ధ వహించ వద్దని త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పద్మ కుమారి పెనుగంచిప్రోలు , వత్సవాయి జడ్పీటీసీలు, ఎంపీపీలు నాగమణి, దేవమణి, గాంధీ, వెంకటేశ్వర్లు, తాసిల్దార్‌ లక్ష్మీ, నాగేశ్వరరావు, ఎంపీడీవో ప్రసాద్‌ రావు, గాంధీ, మైనింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రామారావు పాల్గొన్నారు.