ప్రభుత్వ భూమిని ఎలా పంచుతావ్..
ప్రజాశక్తి-బిట్రగుంట : ప్రభుత్వ భూమిని ప్రజలకు పంచేందుకు పిఎస్‌ఆర్‌కు ఏమి హక్కు ఉందని వైసిపి మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు పేర్కొన్నారు. పిఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ సోమవారం చంద్రబాబు నాయుడుకు మద్దతుగా జరిగిన ర్యాలీలో వైసిపి విమర్శలకు ధీటుగా మంగళవారం మండల వైసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కన్వీనర్ వీరరఘు మాట్లాడుతూ 2019 సంవత్సరంలో ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిస్తే అభివృద్ధి చేస్తాం, ఓడితే సాయం చేస్తాం అంటూ ఎన్నికల్లో నిలబడి ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేకుండా వెళ్లిపోయి ఇప్పుడు మళ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ప్రజలను మభ్య పెట్టేందుకు చూస్తున్నావన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిఒక్క కుటుంబానికి సాయం ప్రభుత్వ ఫలాలు అందాయని పార్టీని విమర్శించే స్థాయి నీకు లేదన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెంచలయ్య, రమణయ్య, అంకులయ్య, ఏ కే సుందర్ రాజ్, నాయబ్ రసూల్, కిష్టయ్య, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










