Feb 13,2023 17:13

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రోగులు లేని గదిలో అగ్నిప్రమాదం సంబంధించినందున, అగ్నిమాపక సిబ్బంది త్వరగా స్పందించడం వలన ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదు. మంటలను ఆర్పడంలో అగ్నిమాపక శాఖ ఎస్‌ఎఫ్‌ఒ శివ శంకర్‌రెడ్డి, ఎల్‌ఎఫ్‌ రవీంద్ర బాబు, డిఒపి శివ, ఎఫ్‌ఎంలు రాజేశ్వర్‌, శంకర్‌, చక్రి పాల్గొన్నారు.