విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సవితమ్మ
ప్రజాశక్తి - పెనుకొండ : ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకే మహాగర్జన పేరుతో వైసిపి మరో నాటకం ఆడుతోందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ విమర్శించారు. సోమవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈరోజు రాయలసీమ నిజంగా గర్జించే స్థితిలో ఉందా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో అమర్ రాజా కంపెనీ , కడపలో ఉక్కు పరిశ్రమ, అనంతపురంలో జాకి,కీయా అనుబంధ సంస్థలు వెళ్లిపోయినందుకా సీమగర్జన అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రమౌళి, శ్రీరాములు, సూర్యనారాయణ, ప్రసాద్, సోమశేఖర్, త్రివేంద్ర నాయుడు, సుబ్రహ్మణ్యం, వాసుదేవరెడ్డి, గయప్ప తదితరులు పాల్గొన్నారు.










