Dec 15,2022 21:16

పొట్టి శ్రీరాములు, సర్ధార్‌ వల్లభారు పటేల్‌ చిత్రపటాల వద్ద నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

       పుట్టపర్తి అర్బన్‌ : ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం మరువలేనిదని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ తెలియజేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో పొట్టి శ్రీరాములు, సర్దార్‌ వల్లభారు పటేల్‌ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలనే త్యాగం చేశారన్నారు. ఆయన త్యాగ ఫలితమే 1956 నవంబర్‌ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. పటేల్‌ స్వాతంత్ర సమరయోధుడి గాక సంస్థానాలను భారతదేశంలో విలీనం కావడానికి గట్టిగా కషి చేశారన్నారు. ఉప ప్రధానిగా, హౌం మంత్రిగా ఎన్నో సేవలు అందించారన్నారు. ఇలాంటి వారి జీవితాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.