ప్రజాశక్తి - హిందూపురం : ప్రతిభా వంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారికి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి గంగప్ప అన్నారు. ఆదివారం స్థానిక ఎంజిఎం పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అభయ- నిస్వార్ధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపిక పరీక్షా నిర్వహించారు. ఈ పరీక్షకు పట్టణంలో వివిధ పాఠశాలలకు చెందిన 423 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా 247 మంది విద్యార్థులు హాజరైనారు. ఈ పరీక్షా పత్రాలను ఎంఇఒ గంగప్ప, ఎంజిఎం పాఠశాల హెచ్‌ఎం సామ్రాజ్యం, ఫౌండర్ సిద్దగిరి శ్రీనివాసులు విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు పరీక్షాల్లో ఉత్తర్ణీత సాధించిన వారికి 10వ తరగతి అనంతరం జరిగే ఎపిఆర్‌జెసి, పాలిటెక్నిక్, ఇతర ప్రవేశ పరీక్షాలతో పాటు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓరియంటల్ స్కూల్ హెచ్‌ఎం పెన్నోబులం, పౌండేషన్ ప్రతినిధులు రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










