Jun 23,2023 21:50

ఫొటో : గర్భిణులకు సూచనలిస్తున్న రిటైర్డ్‌ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ మాశిలామణి

పోషకాహారం తప్పనిసరి
ప్రజాశక్తి-వరికుంటపాడు : గర్భిణులు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని, సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకుంటూ సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని రిటైర్డ్‌ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ మాశిలామణి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులలో వయసు ఎత్తుకు తగిన బరువులేని 114 మంది చిన్నారులను గుర్తించినట్లు అంగన్‌వాడీ సిబ్బంది తెలిపారు. వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. తీ
సుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య అధికారిని కరిష్మా, ఐసిడిఎస్‌ సిడిపిఒ పి.లావణ్య పర్యవేక్షకులు శాను, కళావతి, తేజస్విని, సిహెచ్‌ఒ రాజశేఖర్‌, పిహెచ్‌ఎన్‌ సుశీలమ్మ, ఆరోగ్య పర్యవేక్షకులు నిర్మల, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.